ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra modi) నిర్వహిస్తున్న మన్‌ కీ బాత్‌(Man ki baath) తరహాలోనే..

ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra modi) నిర్వహిస్తున్న మన్‌ కీ బాత్‌(Man ki baath) తరహాలోనే.. ఏపి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Nara chandrababu) నాయుడు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారని తెలిసింది. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఆయన హయాంలోనే 1995-2004 మధ్య 'డయల్‌ యువర్‌ సీఎం'(Dayal your CM ) నిర్వహించారు. ఇప్పుడు మన్‌ కీ బాత్, డయల్‌ యువర్‌ సీఎం కార్యక్రమాల కలయిక ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు బుధవారం అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడియో, వీడియో విధానంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉంది.

Eha Tv

Eha Tv

Next Story