CM Jagan : నేడు కేసీఆర్‌ను పరామర్శించనున్న ఏపీ సీఎం జగన్
నేడు సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఆయన పరామర్శించనున్నారు.

AP CM Jagan will visit KCR today
నేడు సీఎం వైఎస్ జగన్(CM Jagan) హైదరాబాద్(Hyderabad) పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrashekar Rao)ను ఆయన పరామర్శించనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ బంజారాహిల్స్(Banjarahills) రోడ్ నెంబర్ 14లోని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
