CM Jagan : ప్రకాశం జిల్లా ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భాంతి
ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయింది.

AP CM Jagan responded on Prkasham District RTC bus Accident
ప్రకాశం జిల్లా(Prakasham District) దర్శి(Darshi) సమీపంలో ఆర్టీసీ బస్సు(RTC Bus) ప్రమాదానికి గురికావడంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్(CM Jagan) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పొదిలి నుంచి కాకినాడ(Kakinada)కు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ(NCP) కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు(Police) సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రి(CM)కి వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.
