తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) పార్టీలకు సంబంధించిన సోషల్‌ మీడియా(Social media) అసభ్యకరమైన ట్రోలింగ్స్‌ తట్టుకోలేక తెనాలికి చెందిన గీతాంజలి(Geethanjali) ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి(Jagan mohan reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని సీఎం అన్నారు.

తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) పార్టీలకు సంబంధించిన సోషల్‌ మీడియా(Social media) అసభ్యకరమైన ట్రోలింగ్స్‌ తట్టుకోలేక తెనాలికి చెందిన గీతాంజలి(Geethanjali) ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి(Jagan mohan reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని సీఎం అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated On 12 March 2024 5:03 AM GMT
Ehatv

Ehatv

Next Story