CM YS Jagan : ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయిన సీఎం జగన్..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటన సమయంలో జగన్ ఎన్నికల వ్యూహకర్త, ఐపాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) ఢిల్లీ పర్యటన(Delhi Tour)కు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటన సమయంలో జగన్ ఎన్నికల వ్యూహకర్త, ఐపాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor)తో సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం అనంతరం ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా తాడేపల్లి(Tadepalli)లో ఇరువురు సమావేశమవ్వాలని అనుకున్నారు. అది వాయిదా పడటంతో ఢిల్లీలో ప్లాన్ చేశారని సమాచారం.
గత ఎన్నికల్లో జగన్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఐపాక్(IPAC).. ఆ తర్వాత కూడా ఏపీలో సీఎం జగన్‌తో కలిసి పనిచేస్తోంది. అయితే.. ఐపాక్ నుంచి వైదొలిగినట్లు ప్రశాంత్ చెబుతున్నప్పటికీ.. తన టీమ్స్ ద్వారా మార్గనిర్దేశం చేస్తున్నాడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఐపాక్ బృందం ఏపీలోని 175 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ఎమ్మెల్యేల గెలుపు అవకాశాలపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతీ ఎమ్మెల్యే పనితీరును బేరీజు వేసుకుని ప్రత్యామ్నయ మార్గాలను కనుగొని రిపోర్టులు(Reports) తయారుచేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌లపై జగన్.. ప్రశాంత్ కిషోర్‌తో చర్చించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నవరత్నాలతో ప్రజల్లోకి వెళ్లాలని.. 2024 ఎన్నికలకు కొత్త వాగ్దానాలు చేయాల్సిన అవసరం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. సీఎం జగన్‌కు సూచించినట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో దాదాపు 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి.. కొత్త ముఖాలను తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో పోటీ చేసే 175 మంది అభ్యర్థులపై సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ సమీక్ష(Review) జరిపినట్లు సమాచారం.
కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలని సీఎం జగన్ నెల రోజుల క్రితమే నిర్ణయం తీసుకోగా.. ఐపాక్ బృందం రిపోర్టు ప్రకారమే టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ(Tekkali Assembly constituency) అభ్యర్థిని కూడా మార్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లోనే టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas)ను జగన్ ప్రకటించినప్పటికీ.. గత వారం ఆయనను తప్పించి.. టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు అయిన ఆయన భార్య వాణి(Vani)ని అసెంబ్లీ స్థానానికి అభ్యర్థినిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంకెన్ని మార్పులు ఉండనున్నాయోనని సిట్టింగుల్లో, ఆశావహుల్లో టెన్షన్(tension) నెలకొంది.