CM Jagan : మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం... జగన్
గత 58 నెలల కాలంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని, చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM jagan Mohan Reddy) అన్నారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YS Congress) కేంద్ర కార్యాలయంలో ఆయన మేనిఫెస్టోను(Manifesto) విడుదల చేస్తూ 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని చెప్పారు.
గత 58 నెలల కాలంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని, చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM jagan Mohan Reddy) అన్నారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YS Congress) కేంద్ర కార్యాలయంలో ఆయన మేనిఫెస్టోను(Manifesto) విడుదల చేస్తూ 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని, గతంలో ఎన్నికల వేళ రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోను భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించామని సీఎం జగన్ చెప్పారు. అసలు తమ పాలనలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని, ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతీ అధికారి దగ్గర మేనిఫెస్టో ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మేనిఫెస్టోను పంపించామని, ఓ ప్రొగ్రెస్ కార్డు మాదిరి ఏం ఏం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. 2014లోనూ చేయగలిగిందే చెప్పామని, అమలు చేసినా, చేయకున్నా చంద్రబాబులా హామీలు ఇచ్చేదామని చాలామంది తనకు చెప్పారని, కానీ తాను మాత్రం మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయానని జగన్ పేర్కొన్నారు. 'మేం ఇచ్చిన హామీలను ఎంతో నిష్టగా అమలు చేశాం. ఎక్కడా లంచాల ప్రస్తావన లేకుండా డీబీటీ ద్వారా సంక్షేమం అందించాం. 2014-19 మధ్య 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. గత 58 నెలల్లో 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్‌మెంట్, గోరుముద్ద, ఈ పథకాలన్నీ ఆపడం ఎవరి చేత కాదు. జగన్ ఎంతో కష్టపడితేనే ఈ పథకాలు అమలు అవుతున్నాయి. వీటిని ఆపడం, తొలగించడం ఎవరి వల్ల కాదు' అని జగన్ అన్నారు. 'జగన్ ఎప్పుడు అబద్ధాలు ఆడడు. జగన్ ఎప్పుడూ మోసం చేయడు. పేదలను ప్రేమించి, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా.. పెట్టకపోయినా జగన్ వేసిన అడుగులు రాష్ట్రంలో ఎవరూ వేయలేరు. పేదవాళ్లు మంచి చేసే విషయంలో జగన్‌కు ఉన్న ప్రేమ మరెవరికీ ఉండదు.. ఉండబోదు. జగన్‌కు మనసు ఉంది. కల్మషం లేదు. పెన్షన్‌ల విషయంలో అవ్వాతాతల మీద చూపించిన ప్రేమ చరిత్రలో ఎవరూ చూపించలేదు' అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.