Maha Samprokshanam : జమ్మూలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి.. సీఎంకు ఆహ్వానం
జూన్ 3 నుంచి 8వరకు జమ్మూలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగనుంది. 8న మిధున లగ్నంలో కళావాహన, ఆరాధన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి.

AP CM Invited For Jammu Temple Maha Fete
జూన్ 3 నుంచి 8వరకు జమ్మూ(Jammu)లో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి(Sri Venkateshwaraswamy) వారి ఆలయంలో మహా సంప్రోక్షణ(Maha Samprokshana) కార్యక్రమం జరుగనుంది. 8న మిధున లగ్నంలో కళావాహన, ఆరాధన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్(CM Jagan)ను కలిసిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(TTD Chairman YV Subbareddy).. శ్రీవారి మహాసంప్రోక్షణకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానం అందజేశారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంట.. ఎస్.వి.గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, న్యూఢిల్లీ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి(Vemireddy Prashanth Reddy) ఉన్నారు.
