తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో(TS election Result) బీఆర్‌ఎస్(BRS) ఓటమిపై ఏపీ సీఎం జగన్‌(AP CM Jagan) అప్రమత్తమయ్యారనే వార్తలు వస్తున్నాయి. 40 మంది ఎమ్మెల్యేలను మార్చకపోవడంతోనే కేసీఆర్‌(KCR) ఓటమిని మూటగట్టుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చిన 12 స్థానాల్లో దాదాపు 90 శాతం విజయాలు దక్కాయని.. ఇంకో 30 మందిని మార్చిఉంటే ఫలితాలు మరో రకంగా ఉండేవని చెప్తున్నారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో(TS election Result) బీఆర్‌ఎస్(BRS) ఓటమిపై ఏపీ సీఎం జగన్‌(AP CM Jagan) అప్రమత్తమయ్యారనే వార్తలు వస్తున్నాయి. 40 మంది ఎమ్మెల్యేలను మార్చకపోవడంతోనే కేసీఆర్‌(KCR) ఓటమిని మూటగట్టుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చిన 12 స్థానాల్లో దాదాపు 90 శాతం విజయాలు దక్కాయని.. ఇంకో 30 మందిని మార్చిఉంటే ఫలితాలు మరో రకంగా ఉండేవని చెప్తున్నారు. చివరికి 39 స్థానాలతో బీఆర్‌ఎస్‌ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్‌ కూడా అప్రమత్తమైనట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇందుకు జగన్‌ చర్యలు కూడా నిజమే అన్నట్లు కనిపిస్తోంది.

వైసీపీని ప్రక్షాళన చేపట్టేలా సీఎం జగన్‌ అడుగులు పడుతున్నాయి. కొద్ది నెలల్లో జరిగే ఎన్నికలను సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి రెండో సారి ముఖ్యమంత్రి కావాలని జగన్‌ వ్యూహరచనలు చేస్తున్నారు. ఇందుకుగాను భారీగా సిట్టింగ్‌లను(Sitting MLA) మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేల్లో(Survey) పాజిటివ్‌ వచ్చినవారికి తప్ప నెగటివ్ ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేదిలేదని నిర్మొహమాటంగా నేతలకు చెప్తున్నారు. పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుంది.. కానీ ఈ సారి టికెట్ ఇచ్చేది లేదని నర్మగర్బంగా జగన్ చెప్తున్నారట. ఒక్క సోమవారంనాడే 11 మంది అభ్యర్థులను మార్చారు. ముగ్గురు సిట్టింగులకు నో టికెట్ అన్నారని సమాచారం. సీఎం జగన్‌కు సన్నిహితంగా మెలిగే ఆర్కేకు కూడా టికెట్ నిరాకరించినట్లు తెలిసింది. మంగళగిరిలో బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని సీఎం జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం 60 మందికిపైగా ఎమ్మెల్యేలను మార్చే యోచనలో జగన్‌ ఉన్నారని చెప్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టికెట్లు ఇవ్వడం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. సర్వేల్లో పాజిటివ్ రాకుంటే తన, మన అనే తేడా లేకుండా అభ్యర్థులను మార్చుతామని చెప్పారట.
టికెట్ ఇచ్చేది లేదని చెప్పడంతోనే కోటంరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటిలాంటి వారు పార్టీ నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. పార్టీలు మారినా ఫర్వాలేదు కానీ.. టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని సమాచారం. టికెట్ దక్కని నేతల్లో మంత్రులు కూడా ఉండడం గమనార్హం. చివరికి తన సొంత కుటుంబ సభ్యులు కూడా ఈ జాబితాలో ఉన్నారట. తెలంగాన ఎన్నికల ఫలితాలను ఓ పాఠంలా భావించి ఆయన ఈ నిర్ణయానికొచ్చినట్లు చెప్తున్నారు. అందుకే సీఎం జగన్‌ టికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి అధికారం దక్కించుకున్న తర్వాత పార్టీకి లాయల్‌గా ఉన్నవారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం కానీ.. పార్టీ అధికారంలోకి రాకుంటే ఏమీ చేయలేమన్న భావనలో జగన్ ఉన్నారట. మొహమాటానికి పోతే ఓటమి పాలవుతామని.. అందుకే ఈ విషయంలో స్థిరమైన నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన మార్పులు జస్ట్ నామమాత్రమే అని.. మున్ముందు భారీ మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని సమాచారం.

Updated On 12 Dec 2023 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story