సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి ఢిల్లీ వెళ్లనున్నారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధ‌వారం సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7.25 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం ఆయ‌న‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో చంద్రబాబు హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలను కూడా కలిసే అవకాశం ఉందని నివేదిక‌లు చెబుతున్నాయి.

ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీలో చంద్రబాబు విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో కేంద్రం సహకారం అందించాలని కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్టు సమచారం. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు జరపాలని కోరనున్నారు.

Eha Tv

Eha Tv

Next Story