CID Petition To ACB Court : చంద్రబాబు కస్టడీ పిటీషన్‌లో సంచలన విషయాలు
చంద్రబాబును(Chandrababu) మరో మూడు రోజులు కస్టడీకి(Custody) ఇవ్వాలని ఏపీ సీఐడీ(AP CID) ఏసీబీ కోర్టులో(ACB Court) పిటీషన్ దాఖలు చేసింది. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదని పిటీషన్‌లో పేర్కొంది. కస్టడీ ఆర్డర్స్ చూపే వరకూ సమాధానం చెప్పనని మొండికేశారని..
చంద్రబాబును(Chandrababu) మరో మూడు రోజులు కస్టడీకి(Custody) ఇవ్వాలని ఏపీ సీఐడీ(AP CID) ఏసీబీ కోర్టులో(ACB Court) పిటీషన్ దాఖలు చేసింది. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదని పిటీషన్‌లో పేర్కొంది. కస్టడీ ఆర్డర్స్ చూపే వరకూ సమాధానం చెప్పనని మొండికేశారని.. తొలి రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్డర్ కాపీ చదవడంతోనే గడిపేశారని.. లంచ్ బ్రేక్ తరువాత కూడా అదే తంతు కొనసాగించారని పిటీషన్‌లో వెల్లడించారు.
విచారణకు రెండు రోజులు మాత్రమే సమయం ఉందని.. విచారణాధికారి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. విచారణాధికారిని(Investigation) ప్రశ్నలు అడగనివ్వలేదు.. తాను చెప్పదల్చుకున్నదే చంద్రబాబు చెప్పుకుంటూ పోయారని.. ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు పొంతన లేని సమాధానాలు చెప్పారని పిటీషన్‌లో వివరించారు.
కావాలనే చంద్రబాబు కాలయాపన చేశారని.. మాజీ సీఎం హోదాను అడ్డుపెట్టుకుని అధికారులను దబాయించారని పిటీషన్‌లో పేర్కొన్నారు. నిందితుల స్టేట్‌మెంట్లపై చంద్రబాబు ప్రశ్నలు అడగనివ్వలేదని.. ఈ కేసులో నిందితులు ఖన్వేల్కర్, లక్ష్మీ నారాయణ, సుబ్బారావు స్టేట్‌మెంట్లపై సమాధానాలు దాట వేశారని.. బాబు కాలయాపన చేసిన ప్రక్రియను వీడియో రికార్డ్ చేశామని పిటీషన్‌లో పేర్కొన్నారు. 15 రోజుల్లోపే కస్టడీ విచారణ ఉంటుందనే నిబంధనను.. తనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారని.. కేసు నుంచి తప్పించుకునేందుకు విచారణ అడ్డుకున్నారని ఏపీ సీఐడీ పిటీషన్‌లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.