మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ(TDP) సీనియ‌ర్ నేత బుద్ధా వెంకన్నకు(Buddha Venkanna) ఏపీ సీఐడీ(APCID) అధికారులు నోటీసులు(Notice) జారీచేశారు. చంద్రబాబు(Chandrababu) రిమాండ్ కు వ్యతిరేకంగా జడ్జిల‌పై బుద్ధా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోప‌ణ‌ల‌తో సీఐడీ నోటీసులు ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది.

మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ(TDP) సీనియ‌ర్ నేత బుద్ధా వెంకన్నకు(Buddha Venkanna) ఏపీ సీఐడీ(APCID) అధికారులు నోటీసులు(Notice) జారీచేశారు. చంద్రబాబు(Chandrababu) రిమాండ్ కు వ్యతిరేకంగా జడ్జిల‌పై బుద్ధా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోప‌ణ‌ల‌తో సీఐడీ నోటీసులు ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. బుద్ధా వెంక‌న్న అనారోగ్య కార‌ణాల రీత్యా వైద్యం కోసం హైద‌రాబాద్ వెళ్ల‌గా.. అక్క‌డ‌కు వెళ్లిన అధికారులు ఆయ‌న‌కు నోటీసులు అంద‌జేసిన‌ట్లుగా తెలుస్తుంది. జడ్జిల‌పై వ్యాఖ్య‌ల కేసులో సీఐడీ అధికారులు మొత్తం 26 మందిపై కేసు న‌మోదు చేశారు. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరుచేయ‌డంతో మంగ‌ళ‌వారం రాజ‌మండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. న‌వంబ‌ర్ 28వ తేదీ సాయంత్రం 5 గంట‌లలోపు ఆయ‌న లొంగిపోవాల్సివుంది.

Updated On 3 Nov 2023 6:46 AM GMT
Ehatv

Ehatv

Next Story