CID Notice To TDP : స్కిల్ కేసులో టీడీపీకి సీఐడీ నోటీసులు
స్కిల్ కేసులో(Skill Development Case) టీడీపీకి(TDP) ఏపీ సీఐడీ(AP CID) నోటీసులు(Notices) ఇచ్చింది. పార్టీకి సంబంధించిన ఖాతాల వివరాలను ఈ నెల 18లోపు ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది. మంగళగిరిలోని(Mangalgiri) టీడీపీ కేంద్ర కార్యాలయానికి(TDP Office) వెళ్లిన సీఐడీ కానిస్టేబుల్.. టీడీపీ కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు(Ashok babu) నోటీసులు అందజేశారు.

స్కిల్ నిధులు టీడీపీ ఖాతాల్లోకి మళ్లించారని సీఐడీ అనుమానిస్తోంది. వివిధ షెల్ కంపెనీల(shell Company) ద్వారా తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి రూ.27 కోట్లు వచ్చినట్టు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల ఏసీబీ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు అందజేయాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. అయితే.. సీఐడీ అధికారులు వేధిస్తున్నారంటూ ఇప్పటికే టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.