Sand Case On Chandrababu : ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
తెలుగుదేశం(TDP) పార్టీ అధినేత చంద్రబాబు(Chandrbabu) నాయుడుపై ఏపీ సీఐడీ(APCID) మరో కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుక పాలసీలో(Sand Policy) అవకతవకలు జరిగాయంటూ ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది.
తెలుగుదేశం(TDP) పార్టీ అధినేత చంద్రబాబు(Chandrbabu) నాయుడుపై ఏపీ సీఐడీ(APCID) మరో కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుక పాలసీలో(Sand Policy) అవకతవకలు జరిగాయంటూ ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ వెంకటరెడ్డి(Venkat Reddy) ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పీతల సుజాత(Pithala Sujatha), చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్(chinthamaneni Prabhakar), దేవినేని ఉమ(Devineni Uma) పేర్లు ఉన్నాయి.
చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఏపీఎమ్‌డీసీ(APMDC) ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి చంద్రబాబు రూ. 100 కోట్ల జరిమానా విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెగబడ్డ దాష్టీకానికి అప్పట్లో యావత్తు రాష్ట్రం విస్తుబోయింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లటం ఎవ్వరూ మరిచిపోలేరు. కాకపోతే ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరే అన్నిటికన్నా హైలైట్. ఇదేదో గట్టుకింద తగవు మాదిరి వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసే సిగ్గుమాలిన ప్రయత్నం చేశారు. అంతేకాని చింతమనేనిపై కేసు పెట్టడానికి మాత్రం చంద్రబాబుకు మనసొప్పలేదు.
వైసీపీ పాలనలో అవినీతిపై ఎంపీ రఘురామ పిటిషన్ : వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజాధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక్కో శాఖలో జరిగిన అవినీతిపై విపులంగా పిటిషన్‌లో రఘురామ వివరించినట్లు తెలుస్తోంది