ఫైబర్ గ్రిడ్ కేసులో(Fiber Grid Case) ఏపీ సీఐడీ(APCID) దూకుడు పెంచింది. ఈ కేసులో చంద్రబాబు(Chandrababu) సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కేసుకు సంబంధించిన చంద్రబాబు సన్నిహితుల ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని ప్రతిపాదనలు పంప‌గా..

ఫైబర్ గ్రిడ్ కేసులో(Fiber Grid Case) ఏపీ సీఐడీ(APCID) దూకుడు పెంచింది. ఈ కేసులో చంద్రబాబు(Chandrababu) సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కేసుకు సంబంధించిన చంద్రబాబు సన్నిహితుల ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని ప్రతిపాదనలు పంప‌గా.. హోంశాఖ ఆమోదం తెలిపిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అనుమతి కోసం సీఐడీ ఏసీబీ కోర్టులో(ACB court) పిటిషన్‌ దాఖలు చేయనుంది.

రాష్ట్ర హోంశాఖ టెరాసాఫ్ట్‌ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అటాచ్ చేయ‌నున్న‌ ఆస్తుల్లో.. గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్న‌ట్లు తెలుస్తుంది. హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధ‌మైంది.

Updated On 2 Nov 2023 6:29 AM GMT
Ehatv

Ehatv

Next Story