AP CID Chief Sanjay : జీఓ లో ఉన్నది వేరు.. వీరు చేసింది వేరు
కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారని.. ఈ కార్పోరేషన్ ఏర్పాటులో విధి విధానాలు పాటించలేదని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు.
కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారని.. ఈ కార్పోరేషన్ ఏర్పాటులో విధి విధానాలు పాటించలేదని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకే వ్యక్తికి 3 బాద్యతలను అప్పగించారని.. ఆ వ్యక్తే గంటా సుబ్బారావు అని వెల్లడించారు. టీడీపీకి ఎంతో కాలంగా సేవలందించిన జే వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని చార్టెడ్ అకౌంటేంట్ గా పెట్టుకున్నారని.. అప్పటి ప్రభుత్వానికి తెలియకుండా ఇవన్నీ జరగవని అన్నారు. 13 చోట్ల అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలున్నాయని వివరించారు.
రూ.371 కోట్లు మంజూరు చేయాలన్న ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ నోట్ 42వ పేజీలో అప్పటి సీఎం చంద్రబాబు సంతకముంది. కార్పోరేషన్ ఏర్పాటు విషయంలో చంద్రబాబు సంతకం ఉంది. బడ్జెట్ అప్రూవ్ చేయడానికి కౌన్సిల్ సమావేశానికి కూడా (మార్చి 12, 2015 న) చంద్రబాబు సంతకం ఉంది. గంటా సుబ్బారావుని నియమించిన పత్రాలపై కూడా ఆయన సంతకం ఉంది. ఇలా 13 చోట్ల చంద్రబాబు సంతకాలున్నాయని వివరించారు.
జీఓ లో ఉన్నది వేరు, వీరు చేసింది వేరు అని పేర్కొన్నారు. సీమెన్స్ ను తెచ్చి స్కిల్ సెంటర్లు పెట్టాలన్నది జీఓ లో లేదని వెల్లడించారు. రూ.58 కోట్లతో సాఫ్ట్ వేర్ కొన్నారు. అంటే రూ.371 కోట్లలో ఈ రూ.58 కోట్లు మినహాయిస్తే.. మిగతా 313 కోట్లలో 241 కోట్లు నేరుగా ఒక షెల్ కంపెనీకి వెళ్లాయని వివరించారు.