టీడీపీ(TDP Arrest) అధినేత చంద్రబాబు అరెస్ట్(chandrababu Arrest) అయిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆయనను నంద్యాల(Nandhyala) నుంచి విజయవాడకు(vijayawada) రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆయనను విజయవాడకు తీసుకొస్తున్నారు. మరోవైపు ఏపీ సీఐడీ(AP CID) అడిషనల్ డీజీ సంజయ్ ఈ అరెస్ట్ కు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో చంద్రబాబును అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు.

టీడీపీ(TDP Arrest) అధినేత చంద్రబాబు అరెస్ట్(chandrababu Arrest) అయిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆయనను నంద్యాల(Nandhyala) నుంచి విజయవాడకు(vijayawada) రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆయనను విజయవాడకు తీసుకొస్తున్నారు. మరోవైపు ఏపీ సీఐడీ(AP CID) అడిషనల్ డీజీ సంజయ్ ఈ అరెస్ట్ కు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో చంద్రబాబును అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్(Skill Development) స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని తెలిపారు. ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం వాటిల్లిందని అడిషనల్ డీజీ చెప్పారు. షెల్ కంపెనీలకు ఈ డబ్బును తరలించారని అన్నారు. చంద్రబాబు చెపితేనే అగ్రిమెంట్లు జరిగాయని చెప్పారు. ఇందులో చంద్రబాబే సూత్రధారి అని సాక్షులు చెప్పారని వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు.

ఈ కేసులో నారా లోకేశ్(Nara Lokesh) ను కూడా ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. నిధులు కాజేసేందుకే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. గంటా సుబ్బారావును(Ganta Subbarao) కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా నియమించారని తెలిపారు. ఆయనకు నాలుగు పదవులు కట్టబెట్టారని అన్నారు. ఈడీ, జీఎస్టీ సంస్థలు కూడా దీనిపై విచారణ జరిపాయని చెప్పారు. నకిలీ ఇన్ వాయిస్ ల ఆధారంగా నగదు బదిలీ చేశారని తెలిపారు. న్యాయ పరంగా అన్ని చర్యలు తీసుకునే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు. అన్ని వివరాలు బయటకు రావాలంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పదని అన్నారు.

Updated On 9 Sep 2023 1:38 AM GMT
Ehatv

Ehatv

Next Story