CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను (CM Jagan) తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఐఏఎస్ ప్రొబేషనర్స్ కలిశారు. ఏపీ క్యాడర్ అసిస్టెంట్ కలెక్టర్స్ (Assistant Collector) (అండర్ ట్రైనింగ్ 2022) బ్యాచ్‌కు చెందిన 10 మంది సీఎంను కలిశారు.

Assistant Collector meet cm jagan
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను (CM Jagan) తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఐఏఎస్ ప్రొబేషనర్స్ కలిశారు. ఏపీ క్యాడర్ అసిస్టెంట్ కలెక్టర్స్ (Assistant Collector) (అండర్ ట్రైనింగ్ 2022) బ్యాచ్‌కు చెందిన 10 మంది సీఎంను కలిశారు. సీఎంను కలిసిన వారిలో బి.స్మరణ్ రాజ్ (అనకాపల్లి జిల్లాకు అలాట్‌మెంట్), బి.సహదిత్ వెంకట్ త్రివినాగ్ (విజయనగరం), సి.యశ్వంత్ కుమార్ రెడ్డి (తూర్పుగోదావరి), కల్పశ్రీ కే.ఆర్ (పల్నాడు), కుషల్ జైన్ (అనంతపురం), మంత్రి మౌర్య భరద్వాజ్ (వైఎస్సార్ జిల్లా), రాఘవేంద్ర మీనా (శ్రీకాకుళం), సౌర్య మన్ పటేల్ (ప్రకాశం), తిరుమణి శ్రీ పూజ (ఏలూరు), వి.సంజనా సింహా (ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు)లు ఉన్నారు.
ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని సీఎం జగన్ ఐఏఎస్ (IAS) ప్రొబేషనర్స్‌కు మార్గనిర్ధేశం చేశారు. అనంతరం యువ అధికారులకు ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ హెచ్‌ఆర్‌డీ డీజీ ఆర్.పి.సిసోడియా, ఏపీ హెచ్‌ఆర్‌డీ జేడీజీ పి.ఎస్.ప్రద్యుమ్న సీఎం జగన్‌ను కలిశారు.
