Saketh Myneni : సాకేత్ మైనేనికి గ్రూప్-1 ఉద్యోగం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్(AP Cabinet meeting) సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐపీబీ(AIPB) నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Saketh Myneni
సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్(AP Cabinet meeting) సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐపీబీ(AIPB) నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కులగణనకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి జర్నలిస్ట్ కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
జగనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్ అభినందనలు తెలిపింది. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం జగన్ ఆదేశించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరోగ్యశ్రీపై(Arigyasri) మరోసారి అవగాహన కార్యక్రమం చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 6, 790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్‌పై బోధనలు ప్రారంభించాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు.
బ్యాడ్మింటన్(Badminton) క్రీడాకారుడు సాకేత్ మైనేనికి(Saketh maineni) గ్రూప్-1(Group-1) ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫెర్రోఅలైస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ చార్జీలు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రభుత్వంపై రూ.766 కోట్ల భారం పడనుంది. 50 వేల మంది కార్మికులు ఆధార పడినందువలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది
