AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ పెండింగ్ నిర్ణయాల అమలుతో పాటుగా.. అన్ని వర్గాలకు మరింతగా దగ్గరయ్యే కీలక నిర్ణయాలపైన చర్చించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.
ఏపీ సచివాలయం(AP Secretariat)లో సీఎం జగన్(CM Jagan) అధ్యక్షతన బుధవారం ఏపీ మంత్రివర్గ సమావేశం(AP Cabinet Meeting) జరగనుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ పెండింగ్ నిర్ణయాల అమలుతో పాటుగా.. అన్ని వర్గాలకు మరింతగా దగ్గరయ్యే కీలక నిర్ణయాలపైన చర్చించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తాజా ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో ప్రధాని మోదీ(PM Modi)తో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో కీలకమైనవి సీఎం తన మంత్రివర్గ సహచరులకు వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో, పాటుగా ప్రభుత్వం ఈ సారి సమావేశంలో ఉద్యోగాల భర్తీ పైన ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయని సమాచారం. డీఎస్సీ(DSC)తో పాటుగా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. సుమారు 70 అంశాలను కేబినెట్ అజెండాలో చేర్చినట్టు సమాచారం