AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం
ఏపీ కేబినెట్ భేటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 40 అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ కేబినెట్ భేటీ సమావేశం(AP Cabinet Meeting) కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యింది. సీఎం జగన్(CM Jagan) అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 40 అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. SIPB ఆమోదించిన పలు ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్(Green Signal) ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంధన రంగంలో రూ.22,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 5,300 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి లో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
జగనన్న తోడు(Jagananna Thodu) నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల(Assembly Budget Sessions) నిర్వహణపై కూడా కేబినెట్ లో చర్చ జరుగనుంది. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వైద్య, ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిస్థితులపై కూడా మంత్రులతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.