AP Cabinet Key Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడున్నర గంటల పాటు సాగిన సమావేశంలో 55 అంశాలపై చర్చించారు. జులైలో చేపట్టబోయే సంక్షేమ పథకాలు.. 18న జగనన్న తోడు నిధుల జమ, 20న సీఆర్డీఏ, ఆర్-5 జోన్ లలో ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభం, 26న సున్నా వడ్డీకే డ్వాక్రా మహిళలకు డబ్బు జమ, 28న జగనన్న విదేశీ విద్యా పథకంపై సమావేశంలో చర్చించారు.

AP Cabinet Key Decisions
ఏపీ సీఎం జగన్(CM Jagan) అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో మంత్రివర్గం(AP Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడున్నర గంటల పాటు సాగిన సమావేశంలో 55 అంశాలపై చర్చించారు. జులైలో చేపట్టబోయే సంక్షేమ పథకాలుWelfare Schemes).. 18న జగనన్న తోడు(Jagananna Thodu) నిధుల జమ, 20న సీఆర్డీఏ(CRDA), ఆర్-5 జోన్(R5 Zone) లలో ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభం, 26న సున్నా వడ్డీకే డ్వాక్రా మహిళలకు డబ్బు జమ, 28న జగనన్న విదేశీ విద్యా పథకంపై సమావేశంలో చర్చించారు.
అసైన్డ్ భూముల రైతులకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములు(Assigned Lands) పొందిన లబ్ధిదారులు భూమిని పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇతర రైతుల మాదిరిగా వారికి క్రయ, విక్రయాలపై పూర్తి హక్కులు ఇచ్చింది. మొత్తం 63,191.84 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. లంక భూముల విషయంలోనూ 66,111 మందికి పూర్తి హక్కులు కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఒరిజినల్ అసైనీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒరిజినల్ అసైనీలు కాలం చేస్తే వారి వారసులకు ఇది వర్తిస్తుంది. గ్రామాల్లో కులవృత్తులు చేసుకునే వారికి ఇచ్చిన ఇనామ్ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో 1.13 లక్షల మంది బీసీలకు ప్రయోజనం చేకూరనుంది. విశాఖ(Vishaka) భూముల అక్రమాలపై సిట్(SIT) రిపోర్టుకు ఆమోదం తెలిపింది.
టోఫెల్(TOEFL Exam) పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు ప్రముఖ విద్యా సంస్థ ఈటీఎస్(ETS) తో ఒప్పందానికి చేసుకోనుంది. కర్నూలులో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్(Cancer Institute) కు 247 పోస్టులు మంజూరు చేసింది. వర్సిటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచింది. దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు(Retirement Age)ను 62 ఏళ్లకు పెంచనుంది. అంతేకాకుండా అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. అలాగే.. 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
