AP Budget 2025 Live : ఏపీ బడ్జెట్లో.. తల్లికి వందనం పథకంపై తీపి కబురు
రూ.3.22 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్

రూ.3.22 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.
రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.
ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.
మూల ధన వ్యయం రూ.40,635 కోట్లు.
పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు.
బీసీ వెల్ఫేర్‌కు రూ. 23,260 కోట్లు.
వైద్యారోగ్య శాఖకు రూ. 19,260 కోట్లు.
పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలెప్మెంట్. . 18,848కోట్లు.
జలవనరుల అభివృద్ది శాఖ రూ. 18,020 కోట్లు.
మున్సిపల్ అండ్ అడర్బన్ డెవలెప్మెంట్ రూ. 13,862 కోట్లు.
విద్యుత్ శాఖకు రూ. 13,600 కోట్లు.
వ్యవసాయానికి రూ. 11,636 కోట్లు.
సాంఘిక సంక్షేమం రూ. 10,909 కోట్లు.
ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రూ. 10,619 కోట్లు.
రవాణా శాఖకు రూ. 8,785 కోట్లు.
48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులకు రూ.3,377 కోట్లు
పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు,
స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ. 10కోట్లు
రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సీఎం కాల్ సెంటర్ కోసం రూ.101 కోట్లు
ఎన్టీఆర్ భరోసా కోసం రూ.27,518 కోట్లు
ఆదరణ పథకం కోసం వెయ్యి కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కోసం రూ.3,486 కోట్లు
తల్లికి వందనం పథకం కోసం రూ.9,407 కోట్లు
దీపం 2.0 కోసం రూ.2,601 కోట్లు కేటాయింపు
బాల సంజీవని ప్లస్ కోసం రూ.1,163 కోట్లు
మత్స్యకార భరోసా కోసం రూ.450 కోట్లు
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు
అన్నదాత సుఖీభవ కోసం రూ. 6,300 కోట్లు
ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రూ. 62 కోట్లు
ధరల స్థికరణ నిధి కోసం రూ.300 కోట్లు
ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు రూ.6,705 కోట్లు
జల్‌జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం రూ.500 కోట్లు
