KTR Birthday celebrations in Vijayawada : విజయవాడ బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు
కేటీఆర్(KTR) పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో ఉన్న బీఆర్ఎస్(BRS) శ్రేణులు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా, విజయవాడ(Vijayawada) సింగ్ నగర్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో(Party Office) కూడా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి

KTR Birthday celebrations
కేటీఆర్(KTR) పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో ఉన్న బీఆర్ఎస్(BRS) శ్రేణులు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా, విజయవాడ(Vijayawada) సింగ్ నగర్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో(Party Office) కూడా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తల సమక్షంలో ఏపీ బీఆర్ఎస్ సీనియర్ నేత కొణిజేటి ఆదినారాయణ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడూ ఆయనకు ఉండాలని కోరుకుంటున్నామని.. భవిష్యత్తులో ఆయన మరిన్ని మంచి పదవుల్లో కొలువు తీరాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌కు ఏపీ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్‌ను కోరారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పీహెచ్‌డీ చేసిన భారతికి ల్యాప్ టాప్ కానుకగా అందజేసినట్లు తెలిపారు.
