AP BJP Purandeswari : మధ్యంతరం బెయిల్ రావడం మంచిదే
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడుకు ఏపీ హైకోర్టు(AP high Court) మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ(AP BJP) చీఫ్ పురందేశ్వరి(Purandeshwari) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

AP BJP Purandeswari
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడుకు ఏపీ హైకోర్టు(AP high Court) మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ(AP BJP) చీఫ్ పురందేశ్వరి(Purandeshwari) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తప్పు పట్టామని తెలిపారు. నోటీసులివ్వకుండా, విచారణ జరపకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని తాము గతంలోనే తప్పు పట్టామని చెప్పుకొచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదన్నారు. మధ్యంతరం బెయిల్ రావడం మంచిదే అని పురందేశ్వరి పేర్కొన్నారు.
