ఏపీ బీజేపీ(AP BJP) చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeshwari) ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్నదానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఆమె విశాఖ లోక్‌సభ(Vishaka Lok sabha) నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కేంద్ర బీజేపీ పెద్దలు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారట! అందుకే ఇప్పట్నుంచే ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంచి ముహూర్తం చూసుకుని ఇవాళ విశాఖలో బీజేపీ ఎంపీ ఆఫీసును ప్రారంభిస్తున్నారు.

ఏపీ బీజేపీ(AP BJP) చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeshwari) ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్నదానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఆమె విశాఖ లోక్‌సభ(Vishaka Lok sabha) నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కేంద్ర బీజేపీ పెద్దలు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారట! అందుకే ఇప్పట్నుంచే ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంచి ముహూర్తం చూసుకుని ఇవాళ విశాఖలో బీజేపీ ఎంపీ ఆఫీసును ప్రారంభిస్తున్నారు. పురంధేశ్వరి ఇంతకు ముందు 2009, 2019లలో కూడా విశాఖ నుంచే పోటీ చేశారు. 2009లో కాంగ్రెస్‌(Congress) తరఫున విజయం సాధించారు కానీ, 2019లో మాత్రం బీజేపీ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు. కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అక్కడ్నుంచి పోటీ చేయబోతున్నారు. ఈసారి టీడీపీ-జనసేన పోత్తు ఉంటుందని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. ఆ ధైర్యంతోనే ఆమె విశాఖ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలాగైనా సరే, విజయం సాధించి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించాలన్నది ఆమె అభిలాష. విశాఖ నుంచి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఇప్పటి వరకు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఇప్పుడు మరో నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. పాపం ఆయన సంక్రాంతి సంబరాలు, రిపబ్లిక్‌ డే వేడుకలతో పాటు చాలా కార్యక్రమాలను విశాఖ నుంచే చేపట్టారు. నరసింహారావుకు టికెట్ గ్యారంటీ అని అనుకున్న తరుణంలో ఇప్పుడు పురంధేశ్వరి పోటీలోకి వచ్చారు.
విశాఖలో ఎంపీ ఆఫీసు ప్రారంభిస్తున్నారంటే ఆమెనే పోటీ చేస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

Updated On 1 Feb 2024 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story