Daggubati Purandheswari : పొత్తుపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు
తెలుగుదేశంపార్టీతో(TDP) పొత్తు సంగతి ఏపీ బీజేపీ(AP BJP) నాయకులుకు తెలుసో లేదో మరి! పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు(Daggubati Purandheswari) కూడా పొత్తు విషయం తప్ప అన్ని మాట్లాడేశారు. అంటే పొత్తుపై బీజేపీ ఇప్పట్ల తేల్చదన్నమాట! ఈ నెల 18వ తేదీ తర్వాత పొత్తుపై ఓ క్లారిటీ వస్తుందని కేంద్ర అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్న నేతలు చెబుతున్నారు.
తెలుగుదేశంపార్టీతో(TDP) పొత్తు సంగతి ఏపీ బీజేపీ(AP BJP) నాయకులుకు తెలుసో లేదో మరి! పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు(Daggubati Purandheswari) కూడా పొత్తు విషయం తప్ప అన్ని మాట్లాడేశారు. అంటే పొత్తుపై బీజేపీ ఇప్పట్ల తేల్చదన్నమాట! ఈ నెల 18వ తేదీ తర్వాత పొత్తుపై ఓ క్లారిటీ వస్తుందని కేంద్ర అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్న నేతలు చెబుతున్నారు. అప్పటి వరకు ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారట! మరోవైపు పొత్తుపై బీజేపీ నేతల్లో అంత టెన్షన్ లేదు కానీ టీడీపీ నేతలు మాత్రం బాగా టెన్షన్ పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయం ఓ కొలిక్కి రాకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బీజేపీతో పొత్తు ఖరారైతే మాత్రం ఎంత కాదనుకున్నా ఓ 40 అసెంబ్లీ స్థానాలను వదిలేసుకోవాల్సి వస్తుంది. జనసేనకు, బీజేపీకి కలిసి 40 అసెంబ్లీ స్థానాలు, ఏడేనిమిది లోకసభ స్థానాలను ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడే సమస్య వస్తోంది. తమ అభ్యర్థులకు సీట్లు ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలను ఊహించుకుని టీడీపీ పెద్దలు భయపడుతున్నారు. తమకు టికెట్ గ్యారంటీ అని ఇప్పటి వరకు నమ్ముకుని ఉన్న నేతలకు మొండిచేయి చూపిస్తే తిరుగుబాటు చేస్తారేమోనన్న భయం టీడీపీ అధిష్టానానికి ఉంది.