నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ తమ్మినేని విచారణ చేపట్టనున్నారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు నాలుగో రోజు బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఓట్‌ ఆన్‌ అకౌంట్​ బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించనుంది. నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ తమ్మినేని విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే వారికి వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్‌ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై విచారణ జరుగనుంది. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల విచారణ కూడా జరగనుంది. వ్యక్తిగతంగా శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు విచారించనున్నారు. ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్‌లకు నోటీసులు పంపడంతో వారు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

కొద్దిరోజుల కిందట.. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం అమోదించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ రెబల్‌ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.

Updated On 7 Feb 2024 9:53 PM GMT
Yagnik

Yagnik

Next Story