AP Speaker: చర్యలు తీసుకున్న స్పీకర్ తమ్మినేని
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్లు ఇచ్చాయి వైసీపీ, టీడీపీ. వైసీపీ పిటిషన్ లో
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదులతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో ఈ ఎనిమిది స్థానాలూ ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి సమాచారాన్ని ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి... టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్‌లపై అనర్హత వేటు పడింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే తొలిసారి.
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్లు ఇచ్చాయి వైసీపీ, టీడీపీ. వైసీపీ పిటిషన్ లో ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ, ఉండవల్లి శ్రీదేవి ఉండగా.. టీడీపీ పిటిషన్‌లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ ఉన్నారు. పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకేసారి అనర్హత వేటు వేశారు.