Speaker Suspended MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసిన స్పీకర్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meeting) టీడీపీ సభ్యుల(TDP Members) నిరసనల నడుమ జరుగుతున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్(Chandrababu) పై వాయిదా తీర్మానాన్ని పట్టుబడుతూ ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్(Speakers) ఛైర్ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.

Speaker Suspended MLAs
ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meeting) టీడీపీ సభ్యుల(TDP Members) నిరసనల నడుమ జరుగుతున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్(Chandrababu) పై వాయిదా తీర్మానాన్ని పట్టుబడుతూ ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్(Speakers) ఛైర్ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. బాలకృష్ణ(Balakrishna) మీసం మెలి వేయగా.. మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu).. దమ్ముంటే రా అని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేశారు.
వాయిదా అనంతరం స్పీకర్ బాలకృష్ణకు హెచ్చరిక జారీ చేశారు. సభలో మీసాలు మెలివేయడం, తొడగొట్టడం వంటి రెచ్చగొట్టే పనులను బాలకృష్ణ చేశారని... సభ నిబంధనల ప్రకారం ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని ఆయనకు తొలి హెచ్చరిక(Warning) జారీ చేస్తున్నామని చెప్పారు.
అలాగే.. సభా ఆస్తులను(ఫైళ్లను చించడం, బాటిల్ ను పగలగొట్టడం, మైక్ లాగడం, వైర్లు తెంచడం) ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్(Payyavula Keshav), అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad), వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను(Kotam Reddy Sridhar Reddy) ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మిగిలిన టిడిపి సభ్యులందరికీ ఒకరోజు సస్పెన్షన్ వేటు వేశారు. టీడీపీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు.
