ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ(AP Assembly) రెండు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది. బోయ(Boyas), వాల్మీకి( Valmiki) కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానించిన అసెంబ్లీ, దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని మరో తీర్మానం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ(AP Assembly) రెండు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది. బోయ(Boyas), వాల్మీకి( Valmiki) కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానించిన అసెంబ్లీ, దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని మరో తీర్మానం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర సందర్భంగా తమను ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులాల వారు జగన్‌ను కోరారు. అప్పుడు జగన్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం బోయ, వాల్మీకి కులాల వారి స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రాయలసీమ జిల్లాల్లో(Rayalaseema Districts) ఆ కులాల ఆర్ధిక, సామాజిక స్థితిగతులను ఏకసభయ కమిషన్‌ తెలుసుకుంది. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ తీర్మానాలను చేశామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఎస్టీలు తనను గుండెల్లో పెట్టుకున్నారని, వారిని కూడా తాను అలాగే గుండెల్లో పెట్టుకుంటానని సీఎం చెప్పారు. ఏజెన్సీలో ఉన్న ఎస్టీలకు దీని ప్రభావం ఉండదని, కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్‌(CM Jagan) అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(Y. S. Rajasekhara Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానించింది. ఇప్పుడు మళ్లీ తీర్మానం చేశామని, మతం మారినంత మాత్రాన వారి సామాజిక, ఆర్ధిక స్థితిగతులు మారవని జగన్‌ పేర్కొన్నారు.

Updated On 24 March 2023 5:16 AM GMT
Ehatv

Ehatv

Next Story