పుష్ప(Pushpa) సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) పాల ట్యాంక‌ర్‌లో ఎర్ర చందనం దుంగ‌ల‌ను త‌రిలించిన‌ట్లు.. ఒక్కోక్క‌రు ఒక్కో స్టైల్లో ఎర్ర చందనం అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్నారు. తాజాగా.. అంబులెన్సులో రోగులను తీసుకెళ్తున్నట్టు నమ్మిస్తూ.. ఎర్రచందనం(Red sandalwood)దుంగలను తరలిస్తున్న అడవిదొంగల ముఠా గుట్టును స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్(Anti-Smuggling Task Force) సిబ్బంది శుక్రవారం ఉదయం గుట్టు రట్టు చేసారు.

వివ‌రాళ్లోకెళితే.. తిరుపతి(tirupathi) కేంద్రంగా పనిచేసే టాస్క్ ఫోర్స్ కడప(Kadapa) సబ్ కంట్రోల్ నుంచి ఆర్ఐ చిరంజీవి టీమ్ లోని ఆర్ఎస్ఐ రాఘవేంద్ర బృందం బాలపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. రైల్వే కోడూరు రేంజిలోని బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద అనుమానాస్పదంగా కనిపించాడు.

అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో.. అతన్ని వెంట తీసుకుని ముందుకు వెళ్ల‌గా.. అక్కడ ఒక అంబులెన్సు కనిపించింది. అంబులెన్సులో కొందరు ఎర్రచందనం దుంగలను ఎక్కిస్తున్నారు. వారిని టాస్క్ ఫోర్స్ బృందం చుట్టుముట్టగా ఏడుగురు పట్టుబడ్డారు. మరో నలుగురు పారిపోయారు.

ప‌ట్టుబ‌డిన వారిని విచారించగా నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి తమిళనాడుకు చెందిన ఏలగిరి అనే మేస్త్రీ ద్వారా కూలీలను సమకూర్చుకుని బెంగుళూరుకు త‌ర‌లించార‌ని పేర్కొన్నారు. అక్కడ నుంచి ప్రసాద్ అనే వ్యక్తి తమిళ కూలీలను తీసుకుని అనంతపురం, గుత్తి మీదుగా తిరుపతి చేరుకుని, అక్కడ నుంచి బాలపల్లి అటవీ ప్రాంతానికి పంపించారని తేలింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Updated On 4 Aug 2023 5:36 AM GMT
Ehatv

Ehatv

Next Story