ఎన్నిక‌ల వేళ‌ ఆంధ్రప్రదేశ్‌లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ పురుడుపోసుకుంది. 'భారత చైతన్య యువజన పార్టీ' (బీసీవై) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఆదివారం ప్రక‌టించారు. చిత్తూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, జనసేన మాజీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ బీసీవైని ప్ర‌క‌టించారు.

ఎన్నిక‌ల వేళ‌ ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradeshలో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ పురుడుపోసుకుంది. 'భారత చైతన్య యువజన పార్టీ' (Bharata Chaithanya Yuvajana Party) పేరుతో కొత్త రాజకీయ పార్టీ(New Political Party)ని ఆదివారం ప్రక‌టించారు. చిత్తూరు(Chittoore) జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, జనసేన(Janasena) మాజీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్(Ramchandra Yadav) బీసీవైని ప్ర‌క‌టించారు. గుంటూరు(Guntur) శివారులోని నాగార్జున యూనివర్సిటీ(Nagarjuna University) ఎదుట జ‌రిగ‌ని బ‌హిరంగ స‌భ‌(Public Meeting)లో ఆదివారం బీఆర్ అంబేద్కర్(BR Ambedhkar) మనవడు ప్రకాశ్ అంబేద్కర్(Prakash Ambedhkar), ఢిల్లీ వర్సిటీ ఫ్రొఫెసర్, బీసీ ఉద్యమకారుడు సూరజ్ మండల్(Sooraj Mandal), తదితర ప్రముఖ నేతల సమక్షంలో రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ పేరును ప్రకటించారు. అనంత‌రం ఆయన పార్టీ విధివిధానాలను ప్రకటించారు.

అనంత‌రం రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే లక్ష్యంతో బీసీవై ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొత్త రాజకీయ పాలన రావాలని అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. జగన్ పాలనలో వైసీపీ పెద్దల నుంచి కార్యకర్తల వరకు అందరూ దోచుకుంటున్నారని.. వారిని చూస్తుంటే పురాణాల్లోని రాక్షులు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రైవేటు భూములు, ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.

2019లో పుంగనూరు(Punganur) నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన‌ రామచంద్ర యాదవ్‌ 16,452 ఓట్లు సాధించి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramchandrareddy) చేతిలో ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో రామచంద్ర యాదవ్‌ సొంత పార్టీ ద్వారా ఏ మేర‌కు స‌త్తా చాటుతారో చూడాలి మ‌రి.

Updated On 23 July 2023 9:21 PM GMT
Yagnik

Yagnik

Next Story