తిరుమల నడక మార్గం అలిపిరిలో గత కొన్ని రోజుల క్రితం చిరుతల కదలికలు భక్తులను, అధికారులను టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వాటిని బంధించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టగా..
తిరుమల(Tirumala) నడక మార్గం(Walk Way) అలిపిరి(Alipiri)లో గత కొన్ని రోజుల క్రితం చిరుత(Leopard)ల కదలికలు భక్తులను, అధికారులను టెన్షన్(Tension) పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వాటిని బంధించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టగా.. అవి ఫలిస్తున్నాయి. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అధికారులు తెలిపారు. చిరుత పలుమార్లు బోను వరకూ వచ్చి వెళ్లినట్టు కూడా సీసీటీవీ కెమెరా(CCTV Cameras)ల్లో కనిపించింది. ఆదివారం రాత్రి ఈ చిరుత బోనులో చిక్కింది. ఇప్పటివరకూ అధికారులు మొత్తం నాలుగు చిరుతలను పట్టుకున్నారు. భక్తుల(Devotees)కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చిరుతలను బంధించేందుకు అధికారులు కొన్ని రోజులుగా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు.