Nara Lokesh : నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు మళ్లీ బ్రేక్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచౌంగ్ తుపాను రేపు తీవ్ర తుపానుగా బలపడనుంది.

Another break for Nara Lokesh Yuvagalam Padayatra
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర(Yuvagalam)కు మళ్లీ బ్రేక్ పడింది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచౌంగ్ తుపాను(Michaung Cyclone) రేపు తీవ్ర తుపానుగా బలపడనుంది. ఈ రోజు మధ్యాహ్నంలోగా నెల్లూరు(Nellore)-మచిలీపట్నం(Machilipatnam) మధ్య కృష్ణా జిల్లా(Krishna District) దివిసీమ(Diviseema) సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. దీంతో నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యువగళం పాదయాత్రకు మూడు రోజులపాటు విరామం ప్రకటించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం కాకినాడ(Kakinada) జిల్లా పిఠాపురం(Pitapuram) నియోజకవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు నారా లోకేష్ పాదయాత్ర చేరుకుంది. తుపాను తగ్గిన తర్వాత ఈ నెల 7న మళ్లీ పాదయాత్ర ఆగిన చోటు నుంచే ప్రారంభం కానుందని టీడీపీ(TDP) వర్గాలు తెలిపాయి.
