అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ఏపీ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టింది. క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి.. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణతో సహా ఐదు కీలక ఫైళ్లపై సంతకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు 203 ఉండగా, విశాఖపట్నంలో 25 ఉన్నాయి. వీటిలో చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ క్యాంటీన్లను పునరుద్ధరించి, తిరిగి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. విశాఖపట్నంలో మరిన్ని అన్నా క్యాంటీన్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విశాఖపట్నంలో, అన్నా క్యాంటీన్లు KGH, పూర్ణామార్కెట్, VIMS హాస్పిటల్, MVP మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ క్యాంటీన్లు పేదల అవసరాలను తీర్చడానికి కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని అందించాయి.


Eha Tv

Eha Tv

Next Story