అదనుచూసి శత్రువుపై పగ తీర్చుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశంపార్టీ(TDP) మహిళా నాయకురాలు ఎన్‌.అనీషారెడ్డి(anisha Reddy) అదే చేయబోతున్నారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ అభ్యర్థి ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డిపై(Amarnath Redy) ఎలాగైనా సరే ప్రతీకార తీర్చుకోవాలనుకున్నారు. అందుకోసం తన భర్త శ్రీనాథ్‌రెడ్డితో(Srinath Reddy) కలిసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు.

అదనుచూసి శత్రువుపై పగ తీర్చుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశంపార్టీ(TDP) మహిళా నాయకురాలు ఎన్‌.అనీషారెడ్డి(Anisha Reddy) అదే చేయబోతున్నారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ అభ్యర్థి ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డిపై(Amarnath Redy) ఎలాగైనా సరే ప్రతీకార తీర్చుకోవాలనుకున్నారు. అందుకోసం తన భర్త శ్రీనాథ్‌రెడ్డితో(Srinath Reddy) కలిసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) పార్టీలో చేరబోతున్నారు. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో దంపతులిద్దరూ వైసీపీలో చేరబోతున్నారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి చెందిన అనీషారెడ్డి గత ఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన మూడు నెలలకే ఆమెను ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి తప్పించారు. పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తనకు కావాల్సిన చల్లా రామచంద్రారెడ్డి అలియాస్‌ చల్లా బాబును పుంగనూరు ఇన్‌ఛార్జ్‌గా నియమించడంలో కీలకపాత్ర వహించారు. మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి కూడా ఆమెకు మద్దతుగా నిలవలేదు. పలమనేరు ఇన్‌ఛార్జ్‌గా అనీషారెడ్డిని, పుంగనూరు ఇన్‌ఛార్జ్‌గా అమర్‌నాథ్‌రెడ్డిని ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తే రెండు నియోజకవర్గాలలో టీడీపికి ఎదురుండదనే నివేదికలు అధినేత చంద్రబాబునాయుడుకు అందాయి. ఇది తెలుసుకున్న అమర్‌నాథ్‌రెడ్డి ఓ ప్లాన్‌ ప్రకారం అనీషారెడ్డికి ఆ పదవి రాకుండా చేయగలిగారు. తీవ్ర మనస్తాపం చెందిన అనీషారెడ్డి, ఆమె భర్త శ్రీనాథ్‌రెడ్డి టీడీపీకి దూరమయ్యారు. ఈ విషయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డిలకు తెలిసింది. వెంటనే వారు మదనపల్లెలో ఉంటున్న అనీషారెడ్డి ఇంటికి వెళ్లారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, మీకు తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. వారు కూడా ఓకే అన్నారు. దంపతులిద్దరూ చేరితే పలమనేరు, పుంగనూరులలో వైసీపీకి లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. పలమనేరులో అయితే మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి అప్పుడే ఓటమి భయం పట్టుకుంది.

Updated On 23 April 2024 7:22 AM GMT
Ehatv

Ehatv

Next Story