ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. పెద్ద సంఖ్యలో

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివెళ్తున్నారు. ఉదయం 6.30 గంటలకే ఓటర్లు క్యూలైన్లలో నిలబడ్డారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు హక్కు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించనున్నారు.

అందరూ పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘‘నా అవ్వాతాతలందరూ…నా అక్కచెల్లెమ్మలందరూ… నా అన్నదమ్ములందరూ… నా రైతన్నలందరూ… నా యువతీయువకులందరూ… నా ఎస్సీ… నా ఎస్టీ… నా బీసీ… నా మైనారిటీలందరూ… అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!’’ అంటూ తన సందేశం ఇచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు పులివెందులకు చేరుకున్నారు. సీఎం జగన్‌.. భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కడప జిల్లా భాకరాపురంలో ఆయన పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అనంతరం ఓటు వేశారు.

Updated On 12 May 2024 9:18 PM GMT
Yagnik

Yagnik

Next Story