ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్‌కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్‌కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను విద్యాశాఖ నిలిపివేసింది. ప్రస్తుతం ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తం 1,800 మంది టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆదేశించడంతో ఆయన సెలవుపై వెళ్లారు. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో సెలవు పెట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు సలహాదారులు రాజీనామాలు చేశారు. ఇప్పటి వరకు రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.