సారీ చెప్పిన ఆంధ్రజ్యోతి..!

ఇద్దరు టీటీడీ ముఖ్యలుకు లుకౌట్‌ నోటీసులు అంటూ ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతిలో ఓ శీర్షిక వచ్చింది. ఈ శీర్షిక సమాచారం లోపం వల్ల జరిగిందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక సవరణ ఇచ్చింది. ఈ సవరణలో ‘ఇద్దరు టీటీడీ ముఖ్యులకు లుకౌట్‌ నోటీసులు!?’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ఒక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఇందులో... గత పాలక మండలి సభ్యుడొకరు అప్పటి టీటీడీ ముఖ్య అధికారితో సన్నిహితంగా మెలిగి... నెయ్యి ఒప్పందాలు కుదర్చడంలో కీలక పాత్ర పోషించినట్లుగా ప్రచురితమైంది. ఇద్దరికీ లుకౌట్‌ నోటీసులు జారీ కానున్నట్లు సమాచారం అందినట్లు కూడా ప్రచురితమైంది. అయితే, ఇది నిజం కాదు. సమాచార లోపం కారణంగా ఈ పొరపాటు జరిగింది' అని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది.

ehatv

ehatv

Next Story