ఏపీ(Andhra pradesh)లో త్వరలోనే గ్రూప్-1 మెయిన్స్‌(Group-1 Mains) పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఏపీ(Andhra pradesh)లో త్వరలోనే గ్రూప్-1 మెయిన్స్‌(Group-1 Mains) పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష(preliminary exam) ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీన విడుదల కాగా 1 లక్షా 48 వేల 881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 91 వేల 463 మంది పరీక్ష రాశారు. ఫలితాల్లో 1:50 చొప్పున 4 వేల 496 మంది అభ్యర్ధులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.తదుపరి దశ అయిన మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల ఇప్పటికే ఏపీపీఎస్సీ(appsc) స్పష్టం చేసింది. అయితే తాజాగా ప్రిలిమ్స్‌ పరీక్షలో 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేసి, మెయిన్స్‌కు అనుమతి ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డీవైఈఓ(DYEO), గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్షలకు ప్రిలిమ్స్‌ నుంచి 1:100 నిష్పత్తిలోనే ఎంపిక చేశారని..గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు గ్రూప్-1 అభ్యర్థులు ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించుకుంటున్నారు. గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఈ ప్రభుత్వమైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. వీరి డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే పరీక్షల కోసం అభ్యర్థులు మరికొంత సమయం కోరే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు గ్రూప్-1 మెయిన్స్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొని ఉంది.

ehatv

ehatv

Next Story