అధికారంలో ఉన్నంత కాలం జగన్‌ మంచి చెడ్డలు వాసిరెడ్డి పద్మకు తెలియదు. అయిదేళ్ల పాటు ఆమె హాయిగానే ఉన్నారు.

అధికారంలో ఉన్నంత కాలం జగన్‌ మంచి చెడ్డలు వాసిరెడ్డి పద్మకు తెలియదు. అయిదేళ్ల పాటు ఆమె హాయిగానే ఉన్నారు. పైగా మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌(women's commission)గా వ్యవహరించారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ఓడిపోయి, వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(Ys Jagan) గద్దె దిగడంతో ఆమెకు జగన్‌లో ఓ నియంత కనిపిస్తున్నారు. రాజకీయపార్టీ కంపెనీలా అగుపిస్తున్నది. ఈమెనే కాదు, చాలా మంది ఇలాంటి ఆరోపణలే చేస్తుంటారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి వాసిరెడ్డి పద్మ(Vasireddy Padma) రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేస్తూ జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్‌ బుక్‌ కాదని, గుండె బుక్‌ అని అన్నారు. ప్రమోషన్స్ కోసం పదాలు వాడటానికి రాజకీయ పార్టీ కంపెనీ కాదన్నారు. పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యతలేదని విమర్శించారు. పరిపాలన చేతకాదని విమర్శించారు. ప్రభుత్వ మద్యం పేరిట పేద ప్రజలను దోచుకున్నారని చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదని విమర్శించారు. పార్టీలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఎన్నో అవమానాలు ఎదురైనా క్రమశిక్షణ కలిగిన నేతగా పార్టీ కోసం పనిచేశానని పద్మ చెప్పారు. మహిళలపై జరుగుతున్న దాడులను వైసీపీ రాజకీయంగా వాడుకోవడం బాధాకరమని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలోనూ అనేక దాడులు జరిగాయని, సీఎం హోదాలో జగన్ ఎప్పుడూ బాధితులను పరామర్శించలేదని తెలిపారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను జగన్‌ దృష్టికి తీసుకెళ్లినా కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇలా రాజీనామా చేశారో లేదో అలా టీడీపీ(TDP) అనుకూల మీడియాలో కూర్చొని జగన్‌పై, జగన్‌ పార్టీపై అనర్గళంగా ప్రసంగించారు.

ehatv

ehatv

Next Story