AP Weather : రెమాల్ తీరం దాటింది....ఇక సూర్య ప్రతాపమే!
తీవ్ర తుఫాన్‌గా బలపడిన రెమాల్(Remal) ఆదివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్(West Bengal), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య తీరం దాటింది. అంతకు ముందు రెమాల్ గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర బంగాళాఖాతం నుంచి తీరం వైపు పయనించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు విపత్తు నిర్వహణ కోసం భారీ ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
తీవ్ర తుఫాన్‌గా బలపడిన రెమాల్(Remal) ఆదివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్(West Bengal), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య తీరం దాటింది. అంతకు ముందు రెమాల్ గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర బంగాళాఖాతం నుంచి తీరం వైపు పయనించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు విపత్తు నిర్వహణ కోసం భారీ ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై లేకపోయినప్పటికీ దీని కారణంగా తేమ తుడిచిపెట్టుకుపోయి, పొడి వాతావరణం ఏర్పడింది. దీనికితోడు రాష్ట్రంలో పశ్చిమదిశగా గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉక్కపోత మరింత పెరగనుంది. రాబోయే రెండురోజులు కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదుకానున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. రెండురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.