ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో

ఏపీలో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. మూడు నెలల కాలానికి అంటే జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటల 3 నిమిషాలకు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని బుగ్గన అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లమని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశామని తెలిపారు. బతకడం కష్టంగా ఉన్న, నిస్సహాయ పేద వర్గాలే మా ప్రాధాన్యత అని తెలిపారు. గత ఐదేళ్ల బడ్జెట్‌లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశామని అన్నారు.

ఇక సభలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్జేయుకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024 ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్స్ అండ్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లు)లను సర్కారు ప్రవేశపెట్టనుంది.

Updated On 6 Feb 2024 10:14 PM GMT
Yagnik

Yagnik

Next Story