రాష్ట్రంలో నేడూ అధిక ఉష్ణోగ్రతల న‌మోద‌వుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఈరోజు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంద‌ని.. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించింది.

రాష్ట్రంలో నేడూ అధిక ఉష్ణోగ్రతల న‌మోద‌వుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఈరోజు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంద‌ని.. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించింది. నిన్న 18 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 131 మండలాల్లో వడగాల్పుల తీవ్ర‌త ఉంద‌ని వివ‌రించింది. నెల్లూరు(Nellore) జిల్లా కొండాపురంలో(Kondapuram) 46.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 46.2 డిగ్రీల‌ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రయాణాల్లో తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించింది.

ఈరోజు శ్రీకాకుళం(Shrikakulam), విజయనగరం(Vijayanagram), పార్వతీపురంమన్యం(Parvathipuramanyam), అల్లూరి సీతారామరాజు(Alluri Sitha rama raju), అనకాపల్లి(Anakapalli), కాకినాడ(kakinada), కోనసీమ(KOnasima), ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45- 48 డిగ్రీల‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45- 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంద‌ని పేర్కొంది. విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంద‌ని తెలిపింది. శ్రీసత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంద‌ని పేర్కంది.

Updated On 16 May 2023 3:01 AM GMT
Ehatv

Ehatv

Next Story