తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై(Telangana Assembly Elections) ఏపీలో బెట్టింగుల(AP Betting) జోరు నడుస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌(BRS), ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌(Congress) మధ్య పోరు హోరాహోరీగా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఎన్నికలపై ఏపీలో అందరి దృష్టి పడింది. ఈ సారి ఎవరికి అధికారం రాబోతుందనే అంశంపై బెట్టింగ్‌లకు పాల్పడుత్నారట. అందుగాను వాట్సాప్‌, టెలిగ్రామ్‌లాంటి గ్రూపులను క్రియేట్‌ చేసి మరీ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసెంబ్లీ ఎన్నికలపై వందల కోట్ల రూపాయిల బెట్టింగులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై(Telangana Assembly Elections) ఏపీలో బెట్టింగుల(AP Betting) జోరు నడుస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌(BRS), ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌(Congress) మధ్య పోరు హోరాహోరీగా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఎన్నికలపై ఏపీలో అందరి దృష్టి పడింది. ఈ సారి ఎవరికి అధికారం రాబోతుందనే అంశంపై బెట్టింగ్‌లకు పాల్పడుత్నారట. అందుగాను వాట్సాప్‌, టెలిగ్రామ్‌లాంటి గ్రూపులను క్రియేట్‌ చేసి మరీ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసెంబ్లీ ఎన్నికలపై వందల కోట్ల రూపాయిల బెట్టింగులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్(GHMC) పరిధిలోని కొన్ని నియోజకవర్గాలపై ఈ బెట్టింగ్‌ ముఠా ఫోకస్ పెట్టిందట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, కుకట్ పల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్భుల్లాపూర్, జూబ్లీహిల్స్ పందాలు గట్టిగానే వేస్తున్నారట. అంతే కాకుండా తెలంగాణలోని పలు ముఖ్యమైన నియోజకవర్గాలపైనా ఏపీలో జోరుగా బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. సీఎం కేసీఆర్‌(CM KCR) పోటీ చేస్తున్న గజ్వేల్(Gajwel), కామారెడ్డి(Kamareddy), రేవంత్‌(Revanth Reddy) పోటీ చేస్తున్న కొడంగల్‌, ఈటల పోటీలో ఉన్న హుజూరాబాద్‌ నియోజకవర్గాలపైనా బెట్టింగులు జరుగుతున్నాయట. మరోవైపు ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాక, మునుగోడు, బండి సంజయ్‌ పోటీలో ఉన్న కరీంనగర్‌ కూడా ఈ బెట్టింగ్‌ల జాబితాలో ఉన్నాయని తెలిసింది. ఏపీకి పక్కనే ఉన్న ఖమ్మం, పాలేరుపైనా కూడా బెట్టింగ్‌ రాజాలు ఫోకస్‌ పెట్టారట. అధికార, విపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతల నియోజకవర్గాలపై ఈ బెట్టింగ్‌ ముఠా దృష్టి పడింది. అంతేకాదు మెజార్టీలపై కూడా చర్చిస్తున్నారట. సిద్దిపేట, సిరిసిల్లలో మెజార్టీపైనా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని సమాచారం. ఇక్కడి అభ్యర్థుల గెలుపు ఓటములపై 100 పెడితే 500 ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిసింది. ఒక వేళ ప్రతిపక్ష కాంగ్రెస్సే అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేదానిపైనా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌ గెలిస్తే ఫలానా వారే సీఎం అంటూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారట. శేరిలింగంపల్లి గెలుపోటములపై భీమవరానికి చెందిన ఓ వ్యాపారి అయితే ఏకంగా కోటి రూపాయల బెట్టింగ్‌ పెట్టారట. కోటి పెడితే ఐదు కోట్లు వస్తాయని..పోతే కోటి అంటూ బ్లాంక్‌ చెక్కులను కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ బెట్టింగ్‌ రాజాలు కూడా ఈ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టాయని సమాచారం.

Updated On 16 Nov 2023 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story