ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) అధినేత జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) పూర్తిస్థాయిలో సంసిద్ధమవుతున్నారు. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో జగన్‌(Jagan) ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత కొన్ని వారాలుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు(Sitting MLAs) నియోజకవర్గ మార్పులో, ఉద్వాసనలో ఉంటాయని సూచనప్రాయంగా చెబుతూ వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) అధినేత జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) పూర్తిస్థాయిలో సంసిద్ధమవుతున్నారు. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో జగన్‌(Jagan) ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత కొన్ని వారాలుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు(Sitting MLAs) నియోజకవర్గ మార్పులో, ఉద్వాసనలో ఉంటాయని సూచనప్రాయంగా చెబుతూ వస్తున్నారు. ఆదిమూలపు సురేశ్‌(Aadhimulapu), విడుదల రజని(Vidudhala Rajini), మేరుగు నాగార్జున(Merugu Nagarjuna) వంటి వారిని తమ తమ నియోజకవర్గాల నుంచి తప్పించి మరో నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా నియమించారు. ఇప్పుడు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డిని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు జగన్‌. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చావలి అంజు యాదవ్‌(Anju Yadav) ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఈమె పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి గ్రామవాసి! ఈమె భర్త నల్లబోయిన గంగాధర్‌యాదవ్‌ స్వగ్రామం మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం, మానేరాంపల్లి గ్రామం. అందుకే అంజు యాదవ్‌ మైదుకూరు(Mydukuru) నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. పైగా ఇక్కడ యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. బీసీ సామాజికవర్గం కూడా బలంగా ఉంది. గంగాధర్‌యాదవ్‌- అంజు యాదవ్‌ దంపతులకు నియోజవర్గం ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సొంతంగా వీరికి క్యాడర్‌ కూడా ఉంది. కీలకమైన విషయమేమిటంటే ఇక్కడ తెలుగుదేశంపార్టీ నుంచి బరిలో దిగుతున్నది పుట్టా సుధాకర్‌ యాదవ్‌. అందుకే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూడా ఇక్కడ్నుంచి యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే పోటీలో ఉండాలని అనుకుంటోంది..అంజు యాదవ్‌కు తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. అలిపిరి దగ్గర 2003, అక్టోబరు 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) కాన్వాయ్‌పై నక్సలైట్లు క్లైమోర్‌ మైన్స్‌ పేల్చిన ఘటనలో సీఎం కారుపైకి ఎక్కి సూపర్‌ కాప్‌గా పేరు తెచ్చుకున్నది అంజు యాదవే! ఈమెకు వివాదాస్పద పోలీసు అధికారి అన్న పేరు కూడా ఉంది.

Updated On 12 Dec 2023 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story