Heat Wave Sweeps AP : ఏపీలో భానుడి ప్రతాపం.. ఆ జిల్లాల్లో నేడు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..!
నేడు 84 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
నేడు 84 మండలాల్లో వడగాల్పులు(Heat Wave), ఎల్లుండి 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ(AP) విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
నేడు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు
అనకాపల్లి 1, బాపట్ల 6, తూర్పుగోదావరి 5, ఏలూరు 4, గుంటూరు 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండగా.. కాకినాడ 11, కోనసీమ 1, కృష్ణా 13, ఎన్టీఆర్ 15, పల్నాడు జిల్లాలోని 11 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
• ఈరోజు అల్లూరు(Alluru), ఎన్టీఆర్ కృష్ణా(NTR Krishna), గుంటూరు(Guntur), బాపట్ల(Bapatla), పల్నాడు(Palnadu) జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 46°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి(Tirupati) జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C - 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• నిన్న కృష్ణా జిల్లా నందివాడలో, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 44.5°Cలు నమోదు అయ్యింది. తిరుపతి జిల్లా గూడూరులో 44.4°Cలు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 44.3°Cలు నమోదు అయ్యింది.