Rave Party in Konaseema : ఏపీలో వరుస రేవ్ పార్టీలు.. జనసేన నేత హస్తం?
ఏపీలో కొత్తగా రేవ్ పార్టీ కల్చర్‌ను తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య నిడమర్రు జనసేన మండల అధ్యక్షుడు పుట్టినరోజు రేవ్ పార్టీ జరిపిన ఉదంతం మరిచిపోకముందే
ఏపీలో కొత్తగా రేవ్ పార్టీ కల్చర్‌ను తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య నిడమర్రు జనసేన మండల అధ్యక్షుడు పుట్టినరోజు రేవ్ పార్టీ జరిపిన ఉదంతం మరిచిపోకముందే, న్యూ ఇయర్ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని గొల్లపుంత రోడ్డులో మరో రేవ్ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. జనసేన నాయకుడు ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 31 రాత్రి జరిగిన వేడుకల్లో అమ్మాయిలతో యువకులు, పెద్దలు నృత్యాలు చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో కొంతమంది మహిళలు అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేస్తుండగా, మరికొంత మంది మందు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో జనసేన నాయకుడి వీడియోలు వైరల్ కావడంతో, నిర్వాకుడుతో పాటు మరో నలుగురిపై మండపేట టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సనాతన ధర్మం అంటూ ముందుకు వెళ్తుంటే మరోవైపు జనసేన నేతలు ఇలా రేవ్ పార్టీ నిర్వహించడంపై చర్చనీయాంశమైంది