వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి() మరికాసట్లో తిరుపతికి వెళుతున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి() మరికాసట్లో తిరుపతికి వెళుతున్నారు. శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అన్యమతస్థుడైన జగన్మోహన్‌రెడ్డి డిక్లరేషన్‌పై సంతకం చేసి మరీ భగవంతుడిని దర్శించుకోవాలని కూటమి నేతలు అంటున్నారు. డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం లేనిదే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వేంకటేశ్వరస్వామి ద‌ర్శ‌నం చేసుకోకుండా జ‌గ‌న్‌ను అడ్డుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు చాలా ఏళ్లుగా జ‌రుగుతున్నాయి. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా డిక్ల‌రేష‌న్‌పై సంత‌కాన్ని వివాదం చేయ‌డానికి ఆయన ప్రత్యర్థులు ప్ర‌య‌త్నించారు. నాలుగేళ్ల కిందట గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ పిటిష‌న్‌పై ఇరువర్గాల వాద‌న‌లు విన్న జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ సంచ‌ల‌న తీర్పు ఇచ్చారు. వేంకటేశ్వరస్వామిని జగన్మోహన్‌రెడ్డి దర్శనం చేసుకోవడానికి డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిన అవసరం లేదంటూ పిటిషన్‌ను కొట్టివేశారు జస్టిస్‌ బట్టు దేవానంద్‌. డిక్ల‌రేష‌న్‌పై జ‌గ‌న్ సంత‌కం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని న్యాయ స్థాన‌మే స్పష్టం చేసినప్పుడు అడ్డుకునే హక్కు కూటమి ప్రభుత్వానికి, టీటీడీకి ఎలా ఉంటుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే జగన్‌ సంతకం పెట్టాల్సిందేనని టీటీడీ అధికారులు అడుగుతారంటూ తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా కథనాల మీద కథనాలు రాస్తూ వస్తున్నది.

Eha Tv

Eha Tv

Next Story