అమరావతిలో(Amaravathi) పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు(High court) శుక్ర‌వారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh) హైకోర్టులో ఆర్‌-5 జోన్‌(R-5 Zone) అంశంపై రెండు రోజుల క్రితం వాదనలు ముగిశాయి.

అమరావతిలో(Amaravati) పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు(High court) శుక్ర‌వారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh) హైకోర్టులో ఆర్‌-5 జోన్‌(R-5 Zone) అంశంపై రెండు రోజుల క్రితం వాదనలు ముగిశాయి. అమరావతి రైతులు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ క్ర‌మంలోనే జీవో నెం.45 రద్దు కోరుతూ దాఖలైన రైతుల‌ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు(Guntur), ఎన్టీఆర్‌(NTR) జిల్లా కలెక్టర్లకు భూబదలాయింపు నిమిత్తం సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఈ ఏడాది మార్చి 31న జీవో 45 జారీచేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా.. ఏపీ ప్రభుత్వానికి ఊరట ల‌బించింది.

పిటిషన్ పై విచారణ సందర్భంగా ఛీప్ జ‌స్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని.. రాజధాని ఏ ఒక్కరికో, ఒక వర్గానికి పరిమితం కాదని అన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే అని అన్నారు. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్‌ కాదని ధర్మాసనం తెలిపింది. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగమని హైకోర్టు అభిప్రాయపడింది.

హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుందని.. ఇది తమకు విజయం అని ప్రభుత్వం భావించడం లేదని తెలిపారు. అన్యాయమైన ఒక డిమాండ్ ను కోర్టు కొట్టిపారేసిందని అన్నారు. రాజకీయ దురుద్దేశాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. రాజధాని అంటే ప్రజలు అందరూ ఉండే ప్రాంతం అని సజ్జల వివరించారు. ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలిపారు. మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

Updated On 5 May 2023 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story